 |
ఈరోజు ఎంసిఎక్స్ స్టాక్ ఎక్స్టేంజి ద్రవ్య మార్పిడి
Derivates@MCX-SX ప్రారంభం గురించి ప్రకటిస్తోంది. |
- కేవలం రెండు వారములలో 870+ సభ్యత్వాలను 22 బ్యాంకుల తో ప్రపంచ రికార్డును సాధిస్తోంది
- ప్రత్యక్క్ష వర్తకము ఉదయం 9గం. అక్టోబరు 7, 2008 నాడు ప్రారంభమవుతుంది
|
ముంబై, అక్టబరు 06,2008 - ఎంసిఎక్స్ స్టాక్ ఎక్స్చేంజి (ఎంసిఎక్స్—ఎస్ఎక్స్) వారు ఈరోజు భావి ద్రవ్య విభాగాన్ని ముఖ్య అతిధి గౌరవనీయులైన శ్రీ సి. బి. భావే, వారి చేతులమీదుగా ముంబాయిలో ప్రారంభించారు. సెబి ఛైర్మన్, శ్రీమతి. శ్యామలా గోపీనాధ్, డిప్యూటీ గవర్నర్, ఆర్బిఐ అతిధులుగా విచ్చేసారు. బ్యాంకులనుండి 500 పారిశ్రామిక నాయకులు, కార్పొరేట్స్, మరియు ఆర్దిక సంస్థలనుండి ఈ ప్రారంభోత్సవ సభకు విచ్చేసారు.
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ వద్ద లైవ్ ట్రేడింగ్ ఉదయం 9గం మంగళవారము 7,2008 నుండి ప్రారంభమవుతుంది..
కేవలం రెండు వారాల వ్యవధిలో ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ 870+ సభ్యత్వము 22 బ్యాంకులతో సహా, ప్రైవేటు, పబ్లిక్ విభాగాలు మరియు ఇతర బ్యాంకులు కలసి ఆర్దిక, వాణిజ్య రంగ చరిత్రలో ప్రపంచ రికార్డును సృష్టించాయి.
ఈ సందర్భముగా శ్రీ పి.జి కకోడ్కర్, ఛైర్మన్, ఎంసిఎక్స్—ఎస్ఎక్స్, మాట్లాడుతూ “ ప్రభుత్వము సరియైన సమయములో ఈ ద్రవ్య మార్పిడి విధానాన్ని ఏర్పాటు చేయటానికి ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకుని మాకు అనుమతి ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము . చంచలమైన ఈ రోజుల్లో ఆర్దికరంగంలో రాబోయే ఈ మార్పు ఒక వరం లాంటిది. అదుపు లేకుండా పెరిగిపోతున్న ఆర్దిక పెట్టుబడులను అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అవరోధాలను ఎదుర్కోవాలి. దీని వలన ద్రవ్య మార్పిడిలో వచ్చే కష్టాన్ని ఎదుర్కోవాలంటే ఈ మార్పిడి ధర తెలుసుకోవటం చాలా అవసరం. ఎంసిఎక్స్—ఎస్ఎక్స్, నూతన తరం, సాంకేతిక- ముందడుగుతో, మరియు స్పష్టతతో ఈ మార్పిడిని సాధించాలనే వారందరికీ ఇదొక పెద్ద సవాలు లాంటిది.
“శ్రీ భావే మరియు శ్రీమతి గోపీనాధ్ గారిచే ఈ కార్యక్రమము ప్రారంభించటం చాలా ఆనందంగా వుందని ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ సంస్థ వై స్ ఛైర్మన్ శ్రీ. జిగ్నేష్ షా అన్నారు. భారత ప్రభుత్వము, ఆర్దిక వ్యవస్థ, సెబి, ఆర్ బి ఐ మరియు ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ లో పెట్టుబడి పెట్టిన భాగస్తులు కలసి వాళ్ళ విధానాలు ద్వారా మాకు అండ మరియు దారి చూపించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. రూపాయి విలువ యొక్క ప్రాముఖ్యతను మరియు భారతదేశంలో మొత్తంమీద వ్యాపారరంగములో అవకాశాలు కల్పించటానికి చొరవ తీసుకుని ఒక అడుగు ముందుకు వేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకున్నారు. బలమైన పరిశోధన మరియు నిపుణత గల అధికారులతో కలగలసి వున్న ఎంసిఎక్స్ తో భావితరపు సాంకేతిక మరియి నిజాయితీతో పనిచేసే భాగస్తులు అందరు కలసి ఆర్దిక రంగ మూలవ్యవస్థను ఒకదారికి తీసుకురాగలరని మాకు ఎంతో నమ్మకముగా వుంది".
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ డొరెక్టర్ల బోర్డులో ఉన్నవారు:
|
శ్రీ.పి. డి కాకోడ్కర్ , ఛైర్మన్ (పూర్వపు ఎస్ బ ఐ ఛైర్మన్), శ్రీ జిగ్నేష్ షా, వైస్ ఛైర్మన్, శ్రీ వేప కామేశన్, డైరెక్టర్ (పూర్వపు డిప్యూటీ గవర్నర్ , ఆర్ బి ఐ), శ్రీ ఎస్ ఎస్ ధాకూర్ , డైరెక్టర్ (పూర్వపు విదేశీ ద్రవ్య మార్పిడి కంట్రోలర్, ఆర్ బి ఐ), శ్రీ బి. డి. సుమిత్ర, డైరెక్టర్ (పూర్వపు మేనేజింగ్ డైరెక్టర్, సిసిఐ ఎల్), శ్రీ సి ఎమ్ మనియార్, డైరెక్టర్ (సీనియర్ పార్టనర్, క్రాఫోర్డ్ బైలీ అండ్ కో,) , శ్రీ వి. హరిహరన్ , డైరెక్టర్ మరియు శ్రీ జోసఫ్ మాసే, డైరెక్టర్.
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ సలహాదారుల బోర్డులో ఉన్న వారు:
|
శ్రీ జి. ఎన్.బాజ్ పాయ్, పూర్వపు సెబి ఛైర్మన్ మరియు ఎల్ ఐ సి, శ్రీ వెంకటాచారి, ఛైర్మన్, ఎం సి ఎక్స్ మరియు పూర్వపు ఛైర్మన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్ (ఎఫ్ ఎమ్ సి), శ్రీ ఎ. వి.రాజ్వాడే, బాగా పేరున్న నిపుణుడు, శ్రీ జమాల్ మెక్లై, సి యి ఒ, ఆర్దిక వ్యాపార రంగంల మీద అధికారము గల వ్యక్తి,, శ్రీ నరేష్ దేశపాండే, పూర్వపు ఆర్ బి ఐ న్యాయ సలహాదారు, మరియు శ్రీ గణేష్ రావు, ఐబిఎస్ ఫోరెక్స్ లిమిటెడ్, సి యి ఒ.
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ ద్రవ్య ము నూతన మరియు చురుకైన పధకములతో ముందున్న వ్యాపారరంగములో తీసుకు రాబోతుంది.” భారతదేశ ఆర్దికరంగమును ఒక పద్దతిలో మెరుగుచేయుట” చదువు మరియు పరిశోధనా ద్వారా అన్ని వర్గాల వారు,అనగా చిన్న పెద్ద సంస్థలు, బ్యాంక్సు, వీటిలో వచ్చే హెచ్చు తగ్గులను ఎదుర్కొనుటకు ఒక స్పష్టమైన ప్రణాళిక మరియు వస్తుమార్పిడితో ఈ పోటీని తట్టుకోవటానికి ఆయత్తమవుతుంది..
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ తన సభ్యులు మరియు భాగస్తుల కొరకు కొన్ని లాభాలను మరియు ప్రయోజనాలను అందజేయునటువంటివి:
- పెద్ద సంఖ్యలో వాస్తవంగా ఉపయోగించేవారు
- ఇప్పటి సాంకేతిక రంగానికి అనుగుణంగా సులువుగా ఉపయోగించేవారు
- ప్రమాణీకరించిన కాంట్రాక్టులు: చిన్న లాట్ సైజు— యూఎస్‌డి 1,000
- మధ్యవర్తుల తప్పులతో సంబంధం లేదు
- ఫ్రభావితమైన ధరను ప్రవేశపెట్టుట
- పారదర్శకమైన మరియు సరియైన కాలములో వెలను బయల్పరచటం
- అనేక విధము లైన పద్దతులద్వారా అనుసంధానమును కలిగివుండుట
- క్లియరింగ్ సభ్యులు మరియు ఎక్కవ సంఖ్యలో బ్యాంకులు ఉండటం
బిఐఎస్ వారి త్రైవార్షిక సర్వే ప్రకారము ప్రపంచవ్యాప్త ద్రవ్య మార్పిడి మరియు ఉత్పన్నాల వ్యాపారరంగంలతో పోలిస్తే భారతదేశంలోని ద్రవ్యమార్పిడి రంగం ప్రపంచరంగ లెక్కల ప్రకారము చూస్తే 16వ అతి పెద్ద రోజువారీ రాబడితో పెరిగిపోయింది, 2007 నాటికి 34 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండినది. అలాగే ఒటిసి ఉత్పన్నాల విభాగము భారతదేశ ద్రవ్య మార్పిడి రంగం ఈ మధ్యనే రోజువారి రాబడి అనగా యూఎస్‌డి ప్రకారము 24 బిలియన్ల అమెరికన్ డాలర్లు పెరిగినది, ఇతర దేశాలన్నిటిలో 17 వ స్థానంలో నుంది.
ఈ ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ అంశాలు ఆరంభంలో ద్రవ్య మార్పిడి యు యూఎస్‌డి-ఐఎన్ఆర్ పద్దతిలో 12 నెలల వ్యవధిలో ప్రారంభించబడిన రోజు నుండి మార్చుకునే విధంగా కాంట్రాక్టు చేయబడింది. ప్రతి కాంట్రాక్ట్ పరిమాణము యుఎస్ఎస్ 1,000 మరియు కాంట్రాక్టు భారత రూపాయిలలో చెల్లించబడుతుంది. చెల్లించే వెల భారతదేశ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వెలతో పరిగణించి చెల్లిస్తారు. వ్యాపార లావాదేవీలు సోమవారము నుండి శుక్రవారము ఉదయము 9 గం ల నుండి సాయంత్రము 5 గం ల వరకు జరుగుతాయి,
ఎంసిఎక్స్ స్టాక్ ఎక్స్చేంజి (ఎంసిఎక్స్—ఎస్ఎక్స్) గురించి
|
ఎం సి ఎక్స్ స్టాక్ ఎక్స్చేంజి (ఎంసిఎక్స్—ఎస్ఎక్స్) సెబి మరియు ఆర్ బి ఐ వారిచే వాణిజ్య రంగంలో ద్రవ్య మార్పిడి చేయటానికి ఒక స్టాక్ ఎక్స్చేంజిగా గుర్తించబడింది వ్యాపార ద్రవ్య మార్పిడి ఉత్పన్నాలను నిర్వహించటానికి అనుమతి పొందింది..
ఈ ఎక్స్చేంజి దిగుమతి చేసేవారికి, చేసుకునేవారికి, పెట్టుబడిదారులు, కార్పొరేషన్స్, మరియు బ్యాంకుల ద్వారా ద్రవ్య మార్పిడిలో వచ్చే ప్రమాదావకాశాలనుండి తట్టుకోవటానికి పారదర్శకత మరియు భద్రత కల్పిస్తుంది. ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ ఎక్కువ సంఖ్యలో బ్యాంక్యులు, కార్పోరేట్స్, యింటికి సంబంధించిన లావాదేవీలు జరిపే వారిని ఖచ్చితమైన సభ్యులుగా చేరటానికి ఆసక్తి వున్న అన్ని రంగాల వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. ఇంకా, ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ మధ్యవర్తుల ద్వారా వచ్చే సమస్యలను తీసివేయటానికి ఖచ్చితమైన చెల్లింపు జరపటానికి భద్రత కల్పిస్తుంది. భారీ వినియోగదారులే కాకుండా, ఎంసిఎక్స్—ఎస్ఎక్స్, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారసంస్ఛలు (ఎస్ ఎం ఈ లు) ఇంత వరకూ ద్రవ్య మార్కెట్ లో సులువుగా అవకాశం లేని వారికి కూడా వాభకరంగా ఉంటుంది. ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ ను మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసిఎక్స్) మరియు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ (ఎస్‌టిఐఎల్) వారిచే అభివృద్ధి చేయబడినది.
ఎంసిఎక్స్—ఎస్ఎక్స్,, భావి ద్రవ్య రంగంలో శక్తిగల మరియు నూతనత్వాన్ని ముందుకు తీసుకురాబోతుంది. భారత దేశ వ్యాపార రంగంలో ఒక మెరుగైన పద్దతిలో అనగా విజ్ఞానము మరియు పరిశోధన ద్వారా అదే రీతిగా ఈ ఆర్దిక సాధనాన్ని ఎవరైతే ప్రభావితంగా వినియోగిస్తున్నారో వాళ్ళ లెక్కలను పరిగణలోనికి తీసుకుని వాటి ద్వారా అభివృద్దిలోకి తీసుకురావచ్చని ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ నమ్ముతుంది. |
| |
ఈ కాంట్రాక్టును గురించిన ఇతర వివరములకై, దయచేసి దీనికి కాంట్రాక్టు ప్రమాణాలు చూడండి.
అదనపు సమాచారమునకై దయచేసి సంప్రదించండి:
|
అక్క్షయ్ జైన్
సీనియర్ మేనేజరు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్
మొబైల్: 09930267907
ఫోన్ నం: +91 - 22 - 67318888
రాజేష్ చతుర్వేది
యాడ్ ఫ్యాక్టర్స్ పి ఆర్ ప్రైవేట్ లిమిటెడ్.
ఫోన్ నెం.: +91 9820069038 |
| |
| |
|
|
| |
|
ఫోటోలు |
మీ ఫోటోని పెద్దది చేయటానికి థంబ్ నెయిల్ క్లిక్ చేయండి
కుడివైపు క్లిక్ చేస్తే ఫొటోని పెద్దది చేసిన దానిని సేవ్ చేసే అవకాశం. |
 |
 |
 |
| |
|
 |
|
| |
|
సంబంధిత లింకులు |
|
|
 |
|
| |
|
అనువాదాలు |
|
 |
|
| |
|
సంబంధిత దస్తావేజులు |
|
 |
|
| |
|
సాంఘిక సమాచారము |
|
 |
|
| |
|